viral post: వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!

వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్’ కార్యక్రమం న్యాయనిర్ణేత వినీతా సింగ్‌ (Vineeta Singh) మరణించారని వస్తున్న వదంతులను ఆమె సోషల్‌ మీడియా వేదికగా తోసిపుచ్చారు.

Published : 20 Apr 2024 20:51 IST

దిల్లీ: వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్’ కార్యక్రమం న్యాయనిర్ణేత వినీతా సింగ్‌ (Vineeta Singh) మరణించారని వస్తున్న వదంతులను ఆమె సోషల్‌మీడియా వేదికగా తోసిపుచ్చారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆమె తాను మరణించాననే వదంతులు గత నెల రోజులుగా వస్తున్నాయని తెలిపారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్‌కు, సైబర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా వదంతులు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దీంతో బంధువులు, ప్రజలు వాటిని నిజమనుకొని తరచూ కాల్స్‌ చేస్తున్నారన్నారు. ఈ సమస్యను ఎలా నివారించాలో సలహాలు ఇవ్వండి అంటూ వినీతా నెటిజన్లను కోరారు. 

ఆమె పోస్టుపై స్పందించిన నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి ఫేక్‌న్యూస్‌ వ్యాప్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పోస్టు వైరల్‌ అవడంతో ముంబయి పోలీసులు స్పందిస్తూ తమను కలవాల్సిందిగా పోస్టు పెట్టారు. దీంతో తనకు మద్దతుగా నిలిచినందుకు నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

షార్క్ ట్యాంక్ ఇండియా... దేశంలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే టీవీ షో. ఇందులో వినీతాసింగ్‌ న్యాయనిర్ణేతగా ఉన్నారు. అంతేకాకుండా తన భర్త కౌశిక్‌తో కలిసి ‘షుగర్‌ కాస్మొటిక్స్‌’ సంస్థను ప్రారంభించి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని