Eknath shinde: కర్ణాటక ప్రభుత్వ తీరుపై ఏక్‌నాథ్‌ శిందే విమర్శలు

Eenadu icon
By National News Team Published : 10 Dec 2024 00:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: కర్ణాటక ప్రభుత్వం తీరుపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath shinde) అసంతృప్తి వ్యక్తం చేశారు. బెళగావిలో నిరసనలు తెలుపుతున్న మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి(MES) కార్యకర్తలపై పోలీసుల్ని ప్రయోగించడాన్ని ఖండించారు. సరిహద్దులో మరాఠా మాట్లాడుతున్న ప్రజలపై కర్ణాటక సర్కారు అణచివేత వ్యూహాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.  సోమవారం  ఉదయం కర్ణాటకలోని సువర్ణ విధాన్‌ సౌధలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను  వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి కార్యకర్తలు, నేతలను ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంపై తాజాగా శిందే స్పందించారు. 

మహారాష్ట్ర శాసన మండలి సమావేశంలో భాగంగా ఈ అంశంపై శిందే స్పందించారు. మహారాష్ట్రతో  సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో మరాఠా మాట్లాడే ప్రజలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరి అన్యాయమన్నారు. మహారాష్ట్ర మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్‌ దాన్వే అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి నిర్వహించే సమావేశాన్ని కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, ప్రజా ప్రతినిధులను నిర్బంధించిందని తెలిపారు. మరోవైపు, ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అమిత్‌ షాతో గతంలో సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశంలో సానుకూలంగా చర్చలు జరిగినప్పటికీ.. కర్ణాటక ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరించడం గర్హనీయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు