Fire Accident: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి

Fire Accident: దిల్లీలోని వివేక్‌ విహార్‌ బేబీకేర్‌ ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి  ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 26 May 2024 13:24 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం (Delhi Fire Accident) జరిగింది. తూర్పు దిల్లీ ప్రాంతం వివేక్‌ విహార్‌లో ఉన్న శిశు సంరక్షణ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి చికిత్స అందుతోంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అగ్నిమాపక సిబ్బంది వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడానికి గల కారణం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరో ఘటనలో దిల్లీలోని షహదారా ప్రాంతంలోనూ శనివారం అర్ధరాత్రి ఓ నివాస భవనంలో మంటలు చెలరేగాయి (Fire Accident). సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గేమింగ్‌ జోన్‌లో చెలరేగిన మంటల్లో 27 మంది ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి తేరుకోకముందే దిల్లీలో నవజాత శిశువుల మరణం ఆందోళనకరం.

‘‘దిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. ఈ కష్టసమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని