మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్‌

కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) నెట్టింట్లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 

Updated : 08 Dec 2023 15:38 IST

దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆమె చేసే పోస్టుల్లో చమత్కారం కనిపిస్తుంది. తాజాగా ఆమె తండ్రి అజయ్‌ కుమార్‌ మల్హోత్రా.. ప్రధాని మోదీ (Modi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీని ఆమె పేరెంట్‌-టీచర్ మీటింగ్‌ (PTM)తో పోల్చారు.

‘మన బాస్‌, మన తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చున్నారంటే కంగారొచ్చేస్తుంది. వారిద్దరూ కలిసి మనపై పోటీ పడి ఫిర్యాదులు చెప్పకూడదని ప్రార్థించుకోవాలి. పేరెంట్స్-టీచర్‌ మీటింగ్ జరుగుతోంది’ అని ఇరానీ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. అలాగే మోదీ, ఆమె తండ్రి దిగిన చిత్రాన్ని షేర్ చేస్తూ..  బిజీ షెడ్యూల్‌లో కూడా తమకు సమయం కేటాయించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌, నటుడు సోనూసూద్‌తో  పాటు పలువురు నెటిజన్లు స్పందించారు. ఆమె మంచి విద్యార్థి అని,  బాగా కష్టపడతారని రాసుకొచ్చారు. టీవీ రంగం నుంచి తన కెరీర్ మొదలు పెట్టిన స్మృతి(Smriti Irani).. భాజపాలో కీలక నేతగా ఎదిగారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని