JK: కశ్మీర్‌లో స్టేడియానికి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేరు

బారాముల్లాలోని ఓ స్టేడియానికి దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ పేరు పెడుతూ జమ్మూకశ్మీర్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

Updated : 08 Dec 2023 23:07 IST

శ్రీనగర్‌: దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వర్థంతి వేళ జమ్మూకశ్మీర్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బారాముల్లాలోని ఓ స్టేడియానికి ఆయన పేరు పెట్టి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని జన్‌బాజ్‌పోరా ప్రాంతంలోని జీలం స్టేడియానికి భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పరిపాలన శాఖ కార్యదర్శి సంజీవ్‌ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నామకరణానికి సంబంధించి ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించాలని కశ్మీర్‌ డివిజనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని