Hardeep Singh Puri: రాహుల్‌ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్‌ సింగ్‌

లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి కూడా భాజపాదే విజయమని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినా.. ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిపై కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ స్పందించారు.

Published : 03 Jun 2024 00:04 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి భాజపా విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అయినా సరే.. ఇండియా కూటమి తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. 295కు పైగా స్థానాలను విపక్షాల కూటమి సొంతం చేసుకోనుందంటూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ (Hardeep Singh Puri).. హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు.

‘‘తమ కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఖర్గే పెట్టుకున్న ఆశలు త్వరలో ఆవిరి కానున్నాయి. ప్రస్తుతం ఆయన భ్రమలో ఉన్నారు. కొన్ని గంటల్లో వాస్తవాలను తెలుసుకుంటారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని భాజపాదే విజయమని అంచనా వేశాయి. జూన్‌ 4న వెలువడే ఫలితాల్లో అదే నిజం కానుంది’’ అని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురీ అన్నారు. ఈసారి భాజపా 340కి పైగా సీట్లను గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!

ప్రతిపక్షాల కూటమిపై పురీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోతుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ (Rahul Gandhi) గాంధీ వయసు చాలా చిన్నది. ఆయన ఎదురుచూడటానికి 2029, 2034 ఎన్నికలు ఉన్నాయి’’ అని వ్యంగ్యంగా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని