Shinde: విమర్శలు మానుకోండి.. లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేలే మిగులుతారు: ఏక్‌నాథ్‌ శిందే

Eenadu icon
By National News Team Published : 24 Jan 2025 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: తమ పార్టీ శివసేన (Shiv Sena), అధికార కూటమి మహాయుతిపై విమర్శలు చేస్తున్న శివసేన (యూబీటీ)పై (Shiv Sena (UBT)) మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) మండిపడ్డారు. విమర్శలు మానుకోకపోతే.. 20 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరే మిగులుతారని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

‘‘మొదటి నుంచి కూడా నన్ను, మహాయుతిని శివసేన (యూబీటీ) విమర్శిస్తూనే ఉంది. కానీ, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. వారికి తమ స్థాయి ఏంటో తెలియజెప్పారు. ఓటమి పట్ల వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విమర్శలను ఇలాగే కొనసాగిస్తే.. ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేల నుంచి ఇద్దరే మిగులుతారు’’ అంటూ  హెచ్చరించారు. 

ఇతర రాష్ట్రాల్లోనూ శివసేన..

‘‘ఇటీవల ప్రతిపక్షాల నుంచి చాలామంది నాయకులు, కార్యకర్తలు మా పార్టీలో చేరారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ శివసేనకు ఆదరణ పెరుగుతోంది. మా పార్టీ ఎదుగుతోంది. త్వరలో వేరే రాష్ట్రాల్లోనూ శివసేనను ప్రారంభిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలతో మహాయుతి కూటమి మళ్లీ అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. భాజపా నుంచి సీఎంగా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ బాధ్యతలు స్వీకరించగా.. మాజీ సీఎం శిందే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు