Collegium: ఇద్దరు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి అంగీకరించిన కొలీజియం

దిల్లీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

Updated : 14 Mar 2024 04:50 IST

దిల్లీ: దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్‌ వి.కామేశ్వర్‌ రావు, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. తమను దిల్లీ హైకోర్టు నుంచి దేశంలోని ఇతర ఉన్నత న్యాయస్థానాలకు బదిలీ చేయాలని వారు కొలీజియానికి విన్నవించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం వారి విజ్ఞప్తిని అంగీకరించింది. జస్టిస్‌ వి.కామేశ్వర్‌ రావును కర్ణాటకకు, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాను మధ్యప్రదేశ్‌ హైకోర్టులకు బదిలీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని