స్టార్‌ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్‌గా డెలివరీ బాయ్‌

స్విగ్గీ (Swiggy)కి చెందిన ఒక డెలివరీ బాయ్‌ వీడియో ఆన్‌లైన్‌ చక్కర్లు కొడుతోంది. దానిపై డెలివరీ యాప్ కూడా స్పందించింది. 

Updated : 21 May 2024 15:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్టార్‌ హీరోయిన్ పక్కనే వెళ్తున్నా.. అదేమీ పట్టించుకోకుండా ఒక డెలివరీ బాయ్ తన పనిమీద ముందుకెళ్లిపోవడం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. ఆన్‌లైన్‌లో వైరల్‌ మారిన ఆ దృశ్యాలపై ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) స్పందించింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

ఒక వీడియో క్లిప్‌లో.. స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరు తనకొచ్చిన ఆర్డర్ నిమిత్తం ఒక భవనంలోకి వెళ్తున్నాడు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు అతడిని కొంచెం పక్కకు జరగమని చెప్తున్నారు. వారెందుకు జరగమంటున్నారో అర్థంగాక గందరగోళానికి గురయ్యాడు. తర్వాత అదేమీ పట్టించుకోకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు. అదే సమయంలో సినీ నటి తాప్సి ఆ భవనం నుంచి బయటకు వస్తున్నారు. తలవంచుకొని కారువైపు వెళ్తున్నారు. తాప్సి ఎదురెదురుగా వస్తున్నా అతడు మాత్రం కామ్‌గా లోపలికి వెళ్లిపోయాడు. కెమెరాకు చిక్కిన ఈ దృశ్యాలు తర్వాత నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. అతడు చూపుతున్న నిబద్ధతకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని స్విగ్గీని ట్యాగ్ చేశారు. దానిపై డెలివరీ యాప్ స్పందించింది. ఆ బాయ్‌ను ఉద్దేశించి.. ‘‘ఏమీ పట్టించుకోకుండా.. సంతోషంగా.. తన దారిలో తానుపోతూ..పనిపై దృష్టిపెట్టి’’ అంటూ వ్యాఖ్యను జోడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని