తేజస్వీకి జీడీపీ అంటే ఏంటో కూడా తెలియదు: ప్రశాంత్‌ కిశోర్‌

Eenadu icon
By National News Team Updated : 26 Aug 2024 12:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్‌పై విమర్శలు గుప్పించారు.  బిహార్‌లో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఉన్నప్పటికీ పలు కీలకమైన అభివృద్ధి సూచికల్లో వెనకబడి ఉందని తేజస్వీ చేసిన వ్యాఖ్యలను దుయ్యబట్టారు.

‘‘తేజస్వీ కులం, దోపిడీ, మద్యం మాఫియా, నేరాల గురించి మాట్లాడితే ఏమైనా అనడానికి వీలుంటుంది. కానీ వాటికి బదులుగా ఆయన అభివృద్ధి నమూనాల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. గత 15 ఏళ్లుగా వాళ్లు అధికారంలో ఉన్నారు. ఆయనకు  జీడీపీ(GDP) అంటే ఏమిటో కూడా తెలియదు. అటువంటివారు బిహార్‌ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు’’ అంటూ ప్రశాంత్‌ కిశోర్ వ్యాఖ్యానించారు. తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్విట్జర్‌లాండ్‌లా కనిపించిన బిహార్‌ ఇప్పుడు హీనంగా కనిపిస్తోందా అంటూ ప్రశ్నించారు. నీతీశ్‌కుమార్‌ తిరిగి మహాఘట్‌ బంధన్‌లో చేరితే మళ్లీ గొప్పగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతానని ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా ప్రకటించారు.

ఇటీవల తేజస్వీయాదవ్‌ బిహార్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, అవినీతిలో బిహార్ నంబర్ వన్... నేరాల్లోనూ బిహార్ నంబర్ వన్.. రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ అభివృద్ధి చేయట్లేదు.. భాజపాకు అధికార దాహం మాత్రమే ఉంది కానీ, ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు’’ అని అన్నారు.

Tags :
Published : 26 Aug 2024 11:36 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని