తీవ్ర కొవిడ్ బాధితుల్లో మానసిక కల్లోలం..!
కొవిడ్ బారిన పడి, కోలుకున్నా.. తదనంతర సమస్యలు కొత్తవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తీవ్రంగా కరోనా సోకిన వారికి సంబంధించి అమెరికా పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. మతిమరుపు, ఆందోళనకు గురికావడం, తికమకపడటం వంటి లక్షణాలతో వారు సతమతమవుతున్నట్లు చెప్పారు.
గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: కొవిడ్ బారిన పడి, కోలుకున్నా.. తదనంతర సమస్యలు కొత్తవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తీవ్రంగా కరోనా సోకిన వారికి సంబంధించి అమెరికా పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. మతిమరుపు, ఆందోళనకు గురికావడం, తికమకపడటం వంటి లక్షణాలతో వారు సతమతమవుతున్నట్లు చెప్పారు. కరోనా ప్రారంభ సమయంలో వైరస్ బారిన పడిన ఆసుపత్రిలో చేరిన 150 మంది బాధితులను పరిశీలించగా.. 73 శాతం మందిలో ఈ లక్షణాలను గుర్తించారు. దీన్ని డెలిరియం (మానసికంగా తీవ్ర గందరగోళానికి గురికావడం)గా వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయనం బీఎంజే ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఈ డెలిరియం సమస్య ఉన్నవారిలో బీపీ, డయాబెటిస్‌తో పాటు కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. 2020 మార్చి నుంచి మే మధ్యలో ఐసీయూలో చేరి, ఇంటికి చేరిన బాధితుల్ని పరిశీలించారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం, మెదడులో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్‌కు దారితీస్తోందని, ఫలితంగా వారిలో కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్(జ్ఞాపక శక్తి మందగించడం) వెలుగుచూసిందని చెప్పారు. మెదడులో అక్కడక్కడా వాపు రావడంతో వారు తత్తరపాటుకు గురయ్యారని చెప్పారు. చికిత్స సమయంలో వాడిన మత్తుమందులకు డెలిరియంకు సంబంధం ఉందన్నారు. ఐసీయూ మరీ ముఖ్యంగా వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ఈ మత్తుమందులు వాడటం సర్వసాధారణమేనన్నారు. కొవిడ్ తీవ్ర లక్షణాలతో బాధపడిన వారు ఆందోళనగా ఉండటంతో వారికి ఈ మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
కొంతమందిలో ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ డెలిరియం లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. మూడింట ఒకవంతు మంది ఇంటికి వెళ్లే సమయంలో ఇంకా ఆ సమస్య నుంచి బయటపడలేదు. వారిలో 40 శాతం మందికి వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. తీవ్రమైన కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో జ్ఞాపకశక్తి బలహీనమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ తరహా సమస్యలు టీకాలు, వ్యాప్తిని నియంత్రించాల్సిన ఆవశ్యకతను వెల్లడిచేస్తున్నాయని వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/06/2023)
-
India News
Delhi: రూ.1400కోట్ల వ్యయంతో.. దిల్లీలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ!
-
Movies News
Bellamkonda Ganesh: అప్పుడు రిలీజ్ డేట్ సరిగ్గా ప్లాన్ చేయలేదనే టాక్ వినిపించింది: బెల్లంకొండ గణేశ్
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
Movies News
The Night Manager: ‘ది నైట్ మేనేజర్’.. పార్ట్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన