Viral video: అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్‌

ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి ఆమ్గేను ప్రఖ్యాత రెజ్లర్‌ ది గ్రేట్‌ ఖలీ తాజాగా కలిసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 19 May 2024 17:48 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ‘ది గ్రేట్‌ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ దలీప్‌ సింగ్‌ రానా.. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని కలిశారు. ఈ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియోలో జ్యోతి ఆమ్గేను ఖలీ ఒంటి చేత్తో సరదాగా పైకి ఎత్తగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. వీరిద్దరూ ఇలా ఒకే చోట కనిపించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘వారిద్దరూ చాలా సరదాగా ఉన్నారు..’  ‘ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకూ 92 మిలియన్ల వీక్షణలు, రెండు మిలియన్లకు పైగా లైక్‌లు పొందింది.

1993 డిసెంబర్ 6న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన జ్యోతి ఆమ్గే 62.8 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరిగింది. ఆమె ఎత్తు 2 ఏళ్ల పిల్లల కంటే తక్కువ. దీంతో ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా రికార్డును పొందారు. 2012లో రియాలిటీ టీవీ షో బిగ్ బాస్‌లో ఆమె అతిథిగా కనిపించి అలరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు