Tobacco Company: రూ.50 కోట్ల లగ్జరీ కార్లు.. లెక్కకు మించిన ఆస్తులు..!

ఒక పొగాకు సంస్థ (Tobacco Company)పై ఆదాయపు పన్ను విభాగం జరిపిన సోదాల్లో లెక్కకు మించిన ఆస్తులు వెలుగు చూశాయి. 

Published : 01 Mar 2024 18:11 IST

దిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలతో పొగాకు సంస్థ(Tobacco Company) బంశీధర్‌ గ్రూప్‌పై ఆదాయపు పన్ను విభాగం( Income Tax Department) చేపట్టిన దాడుల్లో కళ్లు చెదిరే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రూపు ఆదాయంలో తప్పుడు లెక్కలను గుర్తించారు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఆ గ్రూప్‌ వారసుడు శివమ్ మిశ్రా ఇల్లును అధికారులు శోధించారు. ఆయన నివాసం దిల్లీలోని వసంత్ విహార్‌లో ఉంది.

మిశ్రా ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లంబోర్గిని, మెక్‌లారెన్‌, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌, పోర్షె వంటి సంస్థలకు చెందిన పలు లగ్జరీ కార్లను గుర్తించారు. రూ.4.5 కోట్ల నగదు, ఇతర దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కుంభకోణం వెనక అసలు నిందితుడు ఆ గ్రూప్‌ అధినేత కేకే మిశ్రా అని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ రూ.20 నుంచి రూ.25 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించగా.. వాస్తవంగా ఆ మొత్తం రూ.100 నుంచి రూ.150 కోట్లమేర ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

దేశంలో పొగాకు సరఫరా చేసే అతిపెద్ద సంస్థల్లో ఈ బంశీధర్‌ గ్రూప్‌ కూడా ఒకటి. పాన్‌మసాలా సంస్థలకు సరకు పంపిణీ చేస్తుంది. ఇక ఈ సోదాల్లో 15 నుంచి 20 బృందాలు పాల్గొన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని