‘ఒంటరిగా బయటకు వెళ్లొద్దు’.. The Kerala Story చిత్రబృందానికి బెదిరింపులు
‘ది కేరళ స్టోరీ’(The Kerala Story)..ఈ చిత్రం పలు వర్గాల మధ్య చర్చనీయాంశంగా మారింది. దీనిని కొన్ని పార్టీలు, రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలో యూపీ(Uttar Pradesh)ప్రభుత్వం మాత్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.
ముంబయి: సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రదర్శనకు కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంటే.. మరికొంత మంది మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు, ఇతర సిబ్బందికి గుర్తు తెలియని నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ‘ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. మీరు మంచి పనులు చేయలేదు’ అని సందేశంలో ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై సుదీప్తో సేన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులపై రాతపూర్వకంగా ఫిర్యాదు అందకపోవడంతో ప్రస్తుతానికి ఎఫ్‌ఐఆర్ నమోదుకాలేదు. అయితే ఆ సినిమా సిబ్బందికి మాత్రం పోలీసులు భద్రత కల్పించారు.
పన్ను మినహాయించిన ఉత్తర్‌ప్రదేశ్..
ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రదర్శనను నిషేధిస్తున్నాయి. ఈ సమయంలో ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath)ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇదివరకు మధ్యప్రదేశ్ కూడా ఈ మినహాయింపునిచ్చింది.
ఈ చిత్రాన్ని పశ్చిమ్ బెంగాల్(West Bengal)లో నిషేధం విధించిన నేపథ్యంలో యూపీ(Uttar Pradesh) ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. రాష్ట్రంలో విద్వేషం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకూడదన్న ఉద్దేశంతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి