PM Modi: ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ

ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.

Published : 28 Mar 2024 18:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ (Lawyers letter) రాసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలుచేస్తున్నాయని అందులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందిస్తూ.. ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ (Congress) సంస్కృతి అని విమర్శించారు.

‘‘అయిదు దశాబ్దాల క్రితం వారే (కాంగ్రెస్‌) కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ (Committed Judiciary) కోసం పిలుపునిచ్చారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారు. కానీ.. దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధతను చాటుకోరు. 140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఆశ్చర్యపోనవసరం లేదు’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

‘‘రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్‌లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లే. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం’’ అని న్యాయవాదులు తమ లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని