TV anchor: వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లి పడిపోయిన లేడీ యాంకర్‌

ప్రత్యక్ష ప్రసారంలో వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లి పడిపోయారు దూరదర్శన్‌కు చెందిన ఓ మహిళా యాంకర్‌. 

Published : 21 Apr 2024 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో బయట తిరగాలంటేనే జనం జంకుతున్నారు. ఇలా వేడి గాలులకు సంబంధించి వార్తలు చదువుతోన్న ఓ మహిళా యాంకర్‌కు ఊహించని పరిణామం ఎదురయ్యింది. వాతావరణ సమాచారం అందిస్తోన్న సమయంలోనే ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌ దూరదర్శన్‌ (Doordarshan) ఛానల్‌లో చోటు చేసుకొంది.

సిబ్బంది సమయానికి స్పందించడంతో యాంకర్‌ లోపాముద్ర సిన్హాకు అపాయం తప్పింది. బీపీ తగ్గడంతోనే పడిపోయినట్లు తన పరిస్థితి గురించి తెలుపుతూ.. సోషల్‌మీడియాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కాకముందే నాకు అసౌకర్యంగా అనిపించింది. కాస్త కుదుటపడిన అనంతరం ప్రసారం మొదలైంది. వార్తలు చదువుతుండడంతో చాలా సేపు నీరు తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా నా కళ్లకు చీకట్లు అలుముకున్నాయి. ఆ తర్వాత ఆకస్మికంగా పడిపోయా’’ అని వివరించారు.

జీతం తక్కువైనా ఐఏఎస్‌ కావాలని ఎందుకనుకుంటారో...ఓ సీఏ పోస్టు వైరల్‌

ఆమె పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. సిన్హా త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని