అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకర ఘటన

ఎయిర్‌పోర్టు(Airport)లో ఆగిఉన్న ఒక విమానాన్ని మరో విమానం ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. 

Published : 27 Mar 2024 19:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతా విమానాశ్రయంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. ట్యాక్సీయింగ్ ప్రాంతంలో రెండు విమానాలు ప్రమాదకర స్థాయిలో దగ్గరకు వచ్చాయి. ఎయిరిండియా(Air India), ఇండిగో(IndiGo) విమానాల మధ్య ఈ ఘటన జరిగింది.

ఇండిగో(IndiGo flight) విమానం కోల్‌కతా విమానాశ్రయంలోని ట్యాక్సీయింగ్ ఏరియాలో ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express flight)ను ఢీ కొట్టింది. దాంతో రెండింటి రెక్కలు దెబ్బతిన్నాయి. రన్‌వే మీదకు వచ్చేందుకు క్లియరెన్స్ కోసం ఆ విమాన (Air India) సిబ్బంది ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టేకాఫ్‌ ముందు లేక ల్యాండింగ్ తర్వాత విమానాలు నెమ్మదిగా కదిలే ప్రాంతాన్ని ట్యాక్సీయింగ్ ఏరియా అంటారు. ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. అలాగే రెండింటిలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సంఘటనతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వారి అసౌకర్యానికి చింతిస్తున్నామని రెండు సంస్థలు ప్రకటనలు విడుదల చేశాయి. ఈ ఘటన సమయంలో ఇండిగోలో 135 మంది ప్రయాణికులు ఉన్నారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని