పైశాచికం.. వీళ్లు మనుషులా.. మానవ మృగాలా?

 ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్దార్థ్‌నగర్‌లో కొందరు వ్యక్తులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. మూత్రం తాగించి, వాళ్ల మలద్వారంలో మిరపకాయలు కుక్కేశారు.

Updated : 06 Aug 2023 20:13 IST

లఖ్‌నవూ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మధ్యప్రదేశ్‌లో (MadhyaPradesh) ఆదివాసీ వ్యక్తిపై మూత్రం పోసిన ఘటనను మర్చిపోక ముందే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttarpradesh) అదే తరహా అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సిద్దార్థ్‌ నగర్‌ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్‌ బాలురిపై కొందరు వ్యక్తులు నీచాతినీచంగా ప్రవర్తించారు. బాటిళ్లలో మూత్రాన్ని నింపి వారిచేత బలవంతంగా తాగించారు. అంతటితో ఆగకుండా మలద్వారంలో పచ్చిమిరపకాయలు చొప్పించారు. ఈ ఘటన ఈ నెల 4న చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో నిందితులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

నూహ్‌లో రాళ్లదాడికి దుండగులు ఉపయోగించిన హోటల్‌ కూల్చివేత..!

వివరాల్లోకి వెళ్తే.. సిద్దార్థనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన 10, 15 ఏళ్ల బాలురిద్దరు డబ్బు దొంగతనం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు వారిని పట్టుకున్నారు. వాళ్లను ఓ చోట బంధించి వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారిని దుర్భాషలాడుతూ.. శారీరకంగా హింసించారు. వాళ్లతో బలవంతంగా పచ్చిమిరపకాయాలు తినిపించారు. మంటతో వాళ్లు ఏడుస్తుంటే.. తాగేందుకు బాటిళ్లలో మూత్రం నింపి ఇచ్చారు. వాళ్లు నిరాకరిస్తే.. చంపేస్తామని బెదిరించి బలవంతంగా తాగించారు. దుస్తులు విప్పించేసి.. వాళ్ల మలద్వారంలో మిరపకాయలు కుక్కేశారు. బాధతో వాళ్లు ఏడుస్తుంటే రాక్షసానందం పొందారు. ఈ ఘటనను అక్కడికి సమీపంలో ఉన్న ఓ చికెన్‌ దుకాణంలో ఉన్న వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో తాజాగా చర్యలకు ఉపక్రమించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని