పక్క పక్క ద్వీపాలు.. 21 గంటలు తేడా!

టైం జోన్‌ ప్రకారం.. సమయం అనేది వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుందని అందరికి తెలిసిందే. ఉదాహరణకు పక్కదేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్‌.. భారత్‌ కంటే అరగంట ముందుంటుంది. పాకిస్థాన్‌ ఏమో భారత్‌కంటే అరగంట వెనక ఉంటుంది. దూర దేశాలతో పోలిస్తే అమెరికా

Published : 07 Mar 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టైం జోన్‌ ప్రకారం.. సమయం అనేది వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుందని అందరికి తెలిసిందే. ఉదాహరణకు పక్కదేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్‌.. భారత్‌ కంటే అరగంట ముందుంటుంది. పాకిస్థాన్‌ ఏమో భారత్‌కంటే అరగంట వెనక ఉంటుంది. దూర దేశాలతో పోలిస్తే అమెరికా సమయం కంటే మనం పదిన్నర గంటలు ముందుంటాం. న్యూజిలాండ్‌తో పోలిస్తే ఏడున్నర గంటలు వెనబడి ఉంటాం. ఇలా దేశాల దూరాన్ని బట్టి సమయంలో తేడాలుంటాయి. పక్కనే ఉండే ప్రాంతాల సమయంలో స్వల్ప తేడానే ఉంటుంది. కానీ, డయోమెడ్‌ ద్వీపాల్లో మాత్రం విచిత్ర పరిస్థితి ఉంటుంది. పక్కపక్కనే ఉండే ఈ రెండు ద్వీపాల్లో 21 గంటల తేడా కనిపిస్తుంది. అదెలా సాధ్యం అంటారా? అయితే తెలుసుకోండి..

అమెరికా, రష్యా దేశాలను వేరు చేస్తూ బేరింగ్‌, చుక్చి సముద్రాల మధ్యలో రెండు ద్వీపాలు ఉన్నాయి. వీటిని 1728 ఆగస్టు 16న డెన్మార్క్‌-రష్యాకు చెందిన నావికుడు వైటస్‌ బేరింగ్‌ ఈ ద్వీపాలను కొనుగొన్నారు. వాటికి గ్రీక్‌ దేవుడైన డయోమెడ్‌ పేరు పెట్టాడు. విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ద్వీపానికి బిగ్‌ డయోమెడ్‌.. చిన్న ద్వీపాన్ని లిటిల్‌ డయోమెడ్‌గా నామకరణం చేశాడు. అయితే, ఈ రెండు ద్వీపాల మధ్య దూరం కేవలం నాలుగు కిలోమీటర్లే ఉన్నా.. సమయంలో మాత్రం 21 గంటలు తేడా ఉంది. నాలుగు కిలోమీటర్ల దూరంతో నిజానికి అంత తేడా రాదు. కానీ, ఈ ద్వీపాల విషయంలో వచ్చింది ఎలాగంటే.. వీటిలో ఒకటి టైం జోన్‌ ప్రారంభంలో ఉంటే.. మరోకటి చివర్లో ఉంది. ఈ రెండు ద్వీపాలను ఇంటర్నేషనల్‌ డేట్‌ లైన్‌ వేరు చేస్తోంది. అంటే బిగ్‌ డయోమెడ్‌లో తేదీ మారిన 21 గంటల తర్వాత లిటిల్‌ డయోమెడ్‌లో తేదీ మారుతుంది. అందుకే బిగ్‌ డయోమెడ్‌ను టుమారో ఐలాండ్‌(రేపటి ద్వీపం).. లిటిల్‌ డయోమెడ్‌ను ఎస్టర్‌డే (నిన్నటి ద్వీపం) అని పిలుస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు