Tiger: ‘సరిస్కా’లో రెండు పులి కూనల జననం.. సీఎం గహ్లోత్‌ ట్వీట్‌

సరిస్కా టైగర్‌ రిజర్వులో రెండు పులి కూనలు జన్మించినట్టు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ వెల్లడించారు.

Updated : 09 Jul 2023 21:26 IST

జైపుర్‌: రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్‌ రిజర్వు(STR)లో పులుల సంఖ్య పెరిగినట్టు సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot)వెల్లడించారు.  సరిస్కా టైగర్‌ రిజర్వులో ఓ పులి (Tiger) రెండు పిల్లలకు(Cubs) జన్మనిచ్చిందని తెలిపారు. ఓ పులి తన రెండు కూనలతో వెళ్తున్న ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘సరిస్కా టైగర్ రిజర్వ్(Sariska Tiger Reserve) నుంచి రెండు పిల్లలు పుట్టిన శుభవార్త అందింది. సరిస్కా టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య ఇప్పుడు 30కి చేరింది.  పర్యావరణానికి కీలకమైన పులుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  మరోవైపు, ఎస్‌టీ-19 అనే ఆడ పులి రెండు పిల్లలకు జన్మనిచ్చిందని అటవీశాఖ వర్గాలు తెలిపాయి. ఆ కూనల వయస్సు 3-4 నెలలుగా కనబడుతోందని.. వాటి కదలికలపై పర్యవేక్షణ ఉంచినట్టు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని