Viral news: ఇదేం పరోటారా బాబోయ్‌..!

హాస్టల్‌ (Hostel)లో ఎలాంటి భోజనాలు పెడతారో చెబుతూ సాక్షిజైన్‌ (Sakshi Jain) అనే మహిళ ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 19 Feb 2023 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా అందరూ ఇంటి భోజనాన్నే (Home food) ఇష్టపడతారు. కానీ, వివిధ పరిస్థితుల కారణంగా హాస్టల్‌ (Hostel)లో ఉండాల్సి వస్తే.. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా.. అమ్మ చేతి వంట తిందామా..అని ఎదురు చూస్తుంటారు. ఎక్కువ మంది హాస్టల్‌ నిర్వహకులు ఖర్చులను వీలైనంత తగ్గించుకునేందుకు నాసిరకమైన భోజనాలు పెట్టడం కూడా ఇందుకు ఓ కారణమే. హాస్టల్‌లో ఎలాంటి భోజనం (Hostel Food) పెడతారో చెబుతూ సాక్షిజైన్‌ అనే మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియో (Unbreakable Paratha) ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

హాస్టల్‌లో యువతికి నిర్వాహకులు అల్పాహారంగా పరోటాను పెట్టారు. ఆకలితో ఉన్న ఆమె.. తినేందుకు ప్రయత్నించగా అది విరగలేదు. కనీసం చెక్క బెంచీకి కొట్టినా శబ్దం వస్తుందే తప్ప అది ముక్కలవడం లేదు. ఈ మొత్తం తంతును ఆమె వీడియో తీశారు. అయితే ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, సాక్షి జైన్‌ అనే మహిళ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘ టేబుల్‌కు కొట్టినా ఇది విరగడం లేదు.. దీన్ని ఎలా తినాలి. హాస్టల్‌ నిర్వాహకులు ఇలాంటి భోజనాలు పెడుతున్నారు’’ అంటూ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.

దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తున్నాయి. ‘పరోటాలో ఐరన్‌ ఎక్కువగా ఉందేమో.. అందుకే విరగడం లేదు. సుత్తితో కొట్టండి’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘దీనిని మీ హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకోండి.. రోడ్డుపై ఎవరైనా అల్లరి చేస్తే దీంతో కొట్టొచ్చు’ అని మరో యూజర్‌ సరదాగా రాసుకొచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని