Terrorist Attack: ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరిగితే.. పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందే

జమ్మూకశ్మీర్‌లో పర్యటక బస్సుపై జరిగిన ఉగ్ర దాడిపై కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌కు హెచ్చరిక చేశారు. 

Published : 10 Jun 2024 17:12 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటక బస్సుపై జరిగిన ఉగ్ర దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌ లష్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్‌) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్ర ఘటనపై కేంద్రమంత్రి రామదాస్‌ అథవాలే తీవ్రంగా స్పందించారు.

‘‘జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందని నేను భావిస్తున్నాను. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరిన సమయంలో.. ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టించేందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇలాంటివి తరచూ జరుగుతుంటే.. మనం పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందే’’ అని అథవాలే దాయాది దేశాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అది లోయలో పడింది. ముష్కరులు 25 నుంచి 30 తూటాలను పేల్చారని బాధితులు తెలిపారు. అప్పుడు ఆ వాహనం శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళుతోంది. ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఉన్న ఆరు లేదా ఏడుగురు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారని బాధితులు వెల్లడించారు. చనిపోయినట్టు నటించి తాము ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పారు. రియాసీ, ఉధంపుర్‌, ఫూంచ్‌, రాజౌరీ ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు దాక్కున్నారని భావిస్తున్న బలగాలు.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని