‘నన్ను క్షమించండి..నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’: కేంద్రమంత్రి పోస్టు

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. 

Published : 20 Mar 2024 10:58 IST

బెంగళూరు: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు(Rameshwaram Cafe Blast) కేసులో నిందితుడికి సంబంధించిన ప్రాంతం గురించి కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో మంత్రి క్షమాణలు చెప్పాల్సివచ్చింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు పోస్టు పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాడని ప్రాథమికంగా తేలింది. దాంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అనుసరిస్తోన్న బుజ్జగింపు రాజకీయాలే కారణమంటూ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె క్షమాపణలు తెలియజేశారు.

‘నేను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్క వర్గాన్ని ఉద్దేశించినవని కాదని తమిళనాడు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. కృష్ణగిరిలో శిక్షణ పొందిన నిందితుడిని ఉద్దేశించే నేను మాట్లాడాను. అయితే నా మాటలు కొందరిని బాధించాయని అర్థమైంది. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని ఆమె పోస్టు పెట్టారు. ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని