UPSC Civils Main Results: యూపీఎస్సీ సివిల్స్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు వీరే..!

Eenadu icon
By National News Team Updated : 09 Dec 2024 19:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

UPSC CSE Main Exam Results| దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్‌ పరీక్షలు జరగ్గా.. ఈ ఫలితాలను UPSC సోమవారం సాయంత్రం విడుదల చేసింది. పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. 

ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మెయిన్‌ పరీక్షలు నిర్వహించిన అధికారులు.. తాజాగా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలో నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర (గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బి) సర్వీసులకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్‌ చేయండి.

Tags :
Published : 09 Dec 2024 19:23 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు