Electoral bonds: వారికి రూ.వేల కోట్లు.. అనేక పార్టీలకు సున్నా!

కొన్ని పార్టీలకు భారీ స్థాయిలో విరాళాలు వచ్చినప్పటికీ.. వందల సంఖ్యలో పార్టీలకు ఎటువంటి విరాళాలు రాలేదని ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన నివేదికలో వెల్లడైంది.

Published : 17 Mar 2024 22:10 IST

దిల్లీ: ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. కొన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలే రూ.వేల కోట్లు ఉన్నాయి. ఇలా భారీ విరాళాలు ఇచ్చినదాంట్లో ఒక సంస్థ.. ఒకే పార్టీకి రూ.509 కోట్లు విరాశం ఇచ్చినట్లు వెల్లడైంది. ఇలా కొన్నింటికి భారీ స్థాయిలో విరాళాలు వచ్చినప్పటికీ.. వందల సంఖ్యలో పార్టీలకు ఎటువంటి విరాళాలూ అందలేదని తేలింది. దాదాపు గుర్తింపు పొందిన/పొందని 500 పార్టీలు ఉండటం గమనార్హం.

  • ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌’ సంస్థ యజమాని లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ (Santiago Martin) మొత్తంగా రూ.1368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశారు. వీటిలో దాదాపు 37శాతం (రూ.509 కోట్లు) డీఎంకేకు విరాళంగా ఇచ్చారు.
  • మాయావతికి చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP).. జాతీయ పార్టీగా గుర్తింపు పొందినప్పటికీ ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాలు పొందలేదని తేలింది. ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని బీఎస్పీ తెలియజేసింది.
  • మేఘాలయాలో అధికారంలో ఉన్న నేషనల్‌ పీపుల్స్‌పార్టీకీ ఎటువంటి విరాళాలు రాలేదు.
  • జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన నేషనల్‌ కాన్షరెన్స్‌కు రూ.50లక్షలే వచ్చాయి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా భారతీ గ్రూపు వాటిని కొనుగోలు చేసింది.
  • సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (SDF) అలాంబిక్‌ ఫార్మా ద్వారా రూ.50లక్షలు వచ్చాయి.
  • సీపీఐ, సీపీఎం, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, సీపీఐ-ఎంఎల్‌ పార్టీలకు ఎటువంటి నిధులు సమకూరలేదు. వాటి సిద్ధాంతాల ప్రకారం వాటిని తిరస్కరించినట్లు సమాచారం.
  • అనేక రాష్ట్రాల్లో క్రియాశీలంగా ఉన్న పార్టీలకూ విరాళాలు రాలేదు. మహారాష్ట్రలో రాజ్‌ఠాక్రేకు చెందిన నవనిర్మాణ్‌ సేన, ఏఐఎంఐఎం, ఐఏయూడీఎఫ్‌, మిజోరం పీపుల్స్‌ మూమెంట్‌, అసోం గణ పరిషత్‌, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌, కేరళ కాంగ్రెస్‌, దివంగత విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే, ఐఎన్‌ఎల్‌డీ, తమిళ్‌ మనీలా కాంగ్రెస్‌లకు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు లభించలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని