Viral video: కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ.. ఇవేం ఫీట్లు బాబోయ్‌..!

Viral video: కదులుతున్న ట్రక్కు నుంచి దారిదోపిడీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 25 May 2024 13:25 IST

Viral video | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆగిన రైలు కిటికీలోంచి చైన్లు లాగడం.. పార్క్‌ చేసిన కార్లలో అద్దాలు పగలుగొట్టి డబ్బు దోచుకెళ్లడం వంటివి నిత్యం చూస్తునే ఉంటాం. కానీ కదులుతున్న ట్రక్కు నుంచి సామాన్లు తస్కరించి.. ఆపై సినీ ఫిక్కీలో ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో (Viral video) నెట్టింట తెగ వైరలవుతోంది.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రా- ముంబయి జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ట్రక్కు పై నుంచి ఇద్దరు వ్యక్తులు ఓ మూటను తొలుత రహదారిపై జారవేయడం వీడియోలో కనిపించింది. ఆపై ఆ వెనుకే ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రాగా.. వారిద్దరూ కదులుతున్న వాహనం నుంచే ప్రమాదకరంగా బైక్‌పై దిగడం గగుర్పాటుకు గురిచేస్తోంది. అటుగా వెళుతున్న వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ధూమ్‌’ మూవీలో చూపించిన దోపిడీ సీన్లూ దిగదుడుపే అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని