Vistara: గాల్లోని విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలపై ఎఫెక్ట్‌!

గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన ఘటన.. శ్రీనగర్‌ విమానాశ్రయంలో కార్యకలాపాల అంతరాయానికి దారితీసింది.

Published : 31 May 2024 18:46 IST

శ్రీనగర్‌: గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) ఘటన కలకలం రేపింది. ఇది కాస్త శ్రీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Srinagar Airport)లో కార్యకలాపాల అంతరాయానికి దారితీసింది. అధికారుల వివరాల ప్రకారం.. ఎయిర్‌ విస్తారా (Air Vistara)కు చెందిన ఓ విమానం 178 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరింది. అయితే.. ఆ ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులోని ‘ఏటీసీ (ATC)’కి సమాచారం అందింది. దీంతో అధికారులు, భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

గంటల తరబడి విమానం ఆలస్యం.. ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు

ఆ ఫ్లైట్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయిన వెంటనే ప్రయాణికులను, సిబ్బందిని కిందికి దించివేశారు. అనంతరం దాన్ని ఖాళీ ప్రదేశానికి తరలించి.. బాంబు స్క్వాడ్‌ బృందాలు, జాగిలాల సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాలేమీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామాలతో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని