Chennai Rains: కొట్టుకుపోయిన కార్లు.. రన్‌వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు

Chennai Rains: భారీ వర్షాలతో చెన్నై నగరం దాదాపు స్తంభించింది. పలు చోట్ల వరద బీభత్సం సృష్టించింది. ఎయిర్‌పోర్టులోకి వరద చేరి విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

Updated : 04 Dec 2023 15:06 IST

చెన్నై: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung)తో తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)కు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు కనతూరు ప్రాంతంలో ఓ గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని