Click here: ఏమిటీ ‘క్లిక్‌ హియర్‌’ ట్రెండ్‌..?

ట్విటర్‌లో తాజాగా జరుగుతున్న క్లిక్‌ హియర్‌ ట్రెండ్‌పై చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల సీజన్‌ కావడంతో రాజకీయ పార్టీలు కూడా దీనిని వాడుకొనే పనిలో ఉన్నాయి. 

Updated : 31 Mar 2024 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్: సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శనివారం నుంచి ‘క్లిక్‌ హియర్‌’ (Click here) అంటూ బోల్డ్‌ బ్లాక్‌ ఫాంట్‌లో రాసిన అక్షరాలతో కింద ఓ మూల వైపునకు చూపిస్తున్న యారో మార్క్‌ చిత్రాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో #ClickHere అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది ఎక్స్‌ వినియోగదారులు తమ టైమ్‌లైన్‌పై ఇదంతా ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. 

సాధారణంగా ఈ చిత్రాల్లోని ఓ మూలవైపునకు సూచిస్తున్న బాణం గుర్తు ఆల్ట్‌ టెక్స్ట్‌ లేదా ఆల్టర్‌నేటివ్‌ టెక్స్ట్‌ ఫీచర్‌ను చూపిస్తోంది. దీనిని ఫొటోలు పోస్టు చేసే వినియోగదారులు టెక్ట్స్‌ను యాడ్‌ చేయడానికి వీలుగా 2016లోనే ప్రవేశపెట్టారు. ఇక్కడి అక్షరాలను టెక్ట్స్‌ టు స్పీచ్‌, బ్రెయిలీతో చదివే అవకాశం ఉంది. దాదాపు 420 క్యారెక్టర్లను దీనిలో రాయవచ్చు. 

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి దీనిని వినియోగించేవారు. వీటిల్లో రాజకీయ ప్రకటనలు, సామాజిక అంశాలు వంటివి ఉంటాయి. ఆన్‌లైన్‌ వీక్షకులతో నిరంతరం టచ్‌లో ఉండటం కోసం ఈ మార్గాలను వినియోగిస్తుంటారు. 

నెటిజన్లు ఏమంటున్నారంటే..

వివిధ రకాల వైరల్‌ ట్రెండ్ల వలే ‘క్లిక్‌ హియర్‌’కు కూడా పలు రకాల ప్రతిస్పందనలు వస్తున్నాయి. దృష్టిలోపాలు ఉన్న వారికి ఆల్ట్‌టెక్స్ట్‌ ఫీచర్‌ను వాడుకొని సాయం చేయాలే కానీ ఇలా చేయడం సరికాదనే అభిప్రాయాలున్నాయి. ఆప్‌, భాజపా వంటి పార్టీల నేతలు ఈ ట్రెండింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తమ రాజకీయ సందేశాలను వీటిల్లో ఉంచి ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. బీజేపీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి క్లిక్‌ హియర్‌లో ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ అనే సందేశం ఉంచగా.. ఆప్‌ రామ్‌లీలా మైదానంలో చేపట్టనున్న మెగా ర్యాలీ ప్రచారానికి దీనిని వాడుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని