Eknath Shinde- Ajit Pawar: ఎటూ తేల్చని శిందే.. అజిత్ పవార్‌కు చురకలు

ముంబయి: మరికొన్ని గంటల్లో మహారాష్ట్రలో (Maharashtra) నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిందే (Eknath Shind), భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (Ajit Pawar) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌ను లక్ష్యంగా చేసుకుని శిందే కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారో నేటి సాయంత్రానికి కొలిక్కి వస్తుంది. ఇటీవల ఏక్‌నాథ్ శిందేను కలిశాను. ప్రభుత్వంలో చేరాలనేది మహాయుతి ప్రతి కార్యకర్త కోరిక అని ఆయనకు తెలిపాను. ఆయన సానుకూలంగా స్పందిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నా’’ అని దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పేర్కొన్నారు.
మీరు, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారా? అని దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో ఏక్‌నాథ్ శిందేను మీడియా ప్రశ్నించింది. దీనిపై శిందే స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం కొలిక్కి రావాలంటే సాయంత్రం వరకు వేచి చేయాల్సిందేనని తెలిపారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ మాట్లాడుతూ.. తానైతే ప్రమాణ స్వీకారం చేస్తానని, శిందేకు సాయంత్రం వరకు తెలిసి వస్తుందోమోనని వ్యాఖ్యానించారు.
" మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ఖరారు" 
అజిత్ వ్యాఖ్యలపై స్పందించిన శిందే.. ‘‘అజిత్‌కు ఉదయం, సాయంత్రం పూట ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది’’ అంటూ చురకలు అంటించారు. ప్రస్తుతం ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమి డిసెంబరు 5న ప్రభుత్వ ఏర్పాటు చేయనుంది. భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్‌కు సీఎం బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫడణవీస్, శిందే, అజిత్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమంటూ కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


