Isha Arora: ఈ పోలింగ్‌ ‘బ్యూటీ’ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌.. ఎవరీ ఈశా అరోడా..?

Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్‌ ఏజెంట్‌ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మరారు. ఇంతకీ ఎవరామె..?

Updated : 20 Apr 2024 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా తొలివిడత ఓటింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో తళుక్కున మెరిసిన ఓ పోలింగ్‌ ఏజెంట్‌ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన ఈశా అరోడా (Isha Arora).

యూపీలోని సహరణ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గంగోహ్‌ ప్రాంతంలో ఈశా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఓటింగ్‌కు ముందు ఈవీఎం బాక్సులు తీసుకుని ఆమె పోలింగ్‌ కేంద్రానికి వెళ్తున్న దృశ్యాలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఆ తర్వాత నిన్న పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఈశా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగిని. గతంలో రెండుసార్లు ఎన్నికల విధులు నిర్వర్తించారు. విధుల్లో ప్రతిఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని, అది ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమని చెబుతున్నారు.  దీన్ని పాటించడం వల్లే ఎన్నికల విధుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదన్నారు.

గతంలో ఇదే రాష్ట్రంలో మరో ‘పోలింగ్‌ బ్యూటీ’ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పసుపు చీరలో.. నల్లద్దాలతో.. ఎన్నికల విధులకు వెళుతూ పోలింగ్ ఏజెంట్‌ రీనా ద్వివేది ఓవర్‌నైట్‌లో సోషల్‌మీడియాలో స్టార్‌ అయ్యారు. ఆ తర్వాత 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆమె ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే రీనా.. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని