Jairam Ramesh: ‘బిలియనీర్‌ పన్ను’కు మద్దతిస్తారా?: కొత్త ఆర్థిక మంత్రికి కాంగ్రెస్‌ ప్రశ్న

ప్రపంచ దేశాల్లో ‘బిలియనీర్‌ పన్ను’ (Billionaire tax)పై చర్చ నడుస్తోందని.. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్థిక మంత్రి ఎవరికి మద్దతు ఇస్తారు? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది.

Published : 10 Jun 2024 00:04 IST

దిల్లీ: ప్రపంచ దేశాల్లో కొంత కాలంగా ‘బిలియనీర్‌ పన్ను’ (Billionaire tax) పై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్థిక మంత్రి దీనికి మద్దతు ఇస్తారా? అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ప్రధానమంత్రి సామాన్యుడి వైపు ఉంటారా? లేకా బిలియనీర్ల వైపు నిలబడతారా? అని అడిగింది. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన వేళ కాంగ్రెస్‌ ఈ ప్రశ్నలు సంధించింది.

‘‘సామాన్యుల వైపు ఉంటారా? లేదా బిలియనీర్ల వైపు నిలబడతారా? అనే విషయం నిరూపించేందుకు ఈ ఏడాది ఓ అవకాశం రానుంది. బ్రెజిల్‌లో జరిగే జీ20 సమావేశంలో బిలియనీర్లపై పన్ను విధించే ప్రతిపాదనపై చర్చ జరగనుంది. దీనికి బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, దక్షిణాఫ్రికా, జర్మనీల ఆర్థిక మంత్రులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత తదుపరి ఆర్థిక మంత్రి దీన్ని సమర్థిస్తారా?’’ అని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ ప్రశ్నించారు.

వ్యవస్థలో లోపాలు, షెల్‌ కంపెనీలు, ఇతర మార్గాలను ఉపయోగించుకొంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు శ్రామిక వర్గం కంటే తక్కువ పన్నులు కడుతున్నారని కాంగ్రెస్‌ నేత ఆరోపించారు. ఈ క్రమంలోనే న్యాయమైన వాటా చెల్లించేందుకు గాను బిలియనీర్లపై గ్లోబల్‌ మినిమమ్‌ టాక్స్‌ చెల్లించే అంశంపై జీ 20లో చర్చ జరగనుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు