LS Polls: ఒకే కుటుంబం.. 1,200 మంది ఓటర్లు.. అభ్యర్థుల దృష్టంతా వీరిపైనే!

 లోక్‌సభ ఎన్నికల వేళ.. అస్సాంలోని తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్‌ గ్రామం వార్తల్లో నిలిచింది. 

Published : 27 Mar 2024 00:15 IST

గుహవాటి: లోక్‌సభ ఎన్నికల వేళ.. అస్సాంలోని తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్‌ గ్రామం వార్తల్లో నిలిచింది. ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లె బాటపట్టారు. కారణం.. ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. రాన్‌ బహదూర్ అనే గోర్ఖా ఇక్కడి సోనిత్‌పూర్ జిల్లాలో స్థిరపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. అతడికి ఐదుగురు భార్యలు. 12 మంది కుమారులు, 10 మంది కుమార్తెలు. 1997లో ఆయన మరణించారు.

ప్రస్తుతం ఆ కుటుంబం విస్తరించింది. దాదాపు 2,500 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఓటర్లు 1,200 మంది. వీరంతా కుటుంబ పెద్దలు ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేస్తారు. దీంతో తేజ్‌పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఈ గ్రామ పెద్దలతో, ముఖ్యంగా రాన్ బహదూర్ థాపా పెద్ద కుమారుడు, ప్రస్తుత గ్రామాధిపతి టిల్ బహదూర్ థాపాతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తుంటారు.

“మా నాన్న ఐదుసార్లు పెళ్లి చేసుకున్నారు. మేం 22 మంది పిల్లలం. ఒకే ఇంట్లో ఉండటం కష్టంగా ఉండటంతో విడిగా జీవిస్తున్నాం. ఇప్పుడు 300 కుటుంబాలు ఉన్నాయి. మాకు 65 మంది మనవళ్లు, 70 మంది మనవరాళ్లు ఉన్నారు’’ అని గ్రామాధిపతి టిల్ బహదూర్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు