Viral News: పెళ్లిమండపంలో సోదరి.. ఆశ్చర్యపోయిన కుటుంబసభ్యులు..
విదేశాల్లో స్థిరపడిన ఓ యువతి భారత్‌లో సోదరుడి పెళ్లికి హాజరై కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల యూకేలో స్థిరపడిన ఓ యువతి భారత్‌లో సోదరుడి వివాహానికి హాజరై తన కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. సోదరి తన వివాహానికి హాజరుకాలేదని నిరాశ చెందిన సోదరుడు ఆమెను పెళ్లి మండపంలో చూసి ఆనందంలో మునిగిపోయాడు. ఆ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. కుటుంబ సభ్యుల భావోద్వేగాలతో నిండిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గతేడాది డిసెంబరులో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షల వీక్షణలు, 42,000 లైకులను సొంతం చేసుకుంది. అయితే ఈ వీడియో చూసిన వీక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వీడియోను చూసిన కొందరు నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. పెళ్లికూతురు నుంచి బంధువుల దృష్టిని సోదరి తన వైపునకు మరల్చున్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ‘పెళ్లి కూతురిని చూస్తే నాకు బాధగా ఉంది. అందరి దృష్టి, ఆప్యాయత ఆమెపై ఉండాలి. సోదరుడిపై ఆ యువతికి ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను. కానీ సందర్భానుసారం నడుచుకోవాలి’ అని వీడియో చూసిన ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘ఈ వీడియోలో కనిపించిన కుటుంబ సభ్యుల అనుబంధం నన్ను కంటతడి పెట్టించింది’ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్