Elon Musk: ఎక్స్‌లో పూర్తి నిడివి సినిమాలు

సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ (ట్విటర్‌) మరో సంచలనానికి సిద్ధమైంది. ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించనుంది. ఎక్స్‌ చందాదారులు సినిమాలు, టీవీ సీరియళ్లను పోస్ట్‌ చేయొచ్చని, వాటిని మానెటైజ్‌ చేయటం ద్వారా డబ్బు సంపాదించొచ్చని ఇలాన్‌ మస్క్‌ ఇటీవలే ప్రకటించారు మరి.

Published : 22 May 2024 04:58 IST

సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ (ట్విటర్‌) మరో సంచలనానికి సిద్ధమైంది. ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించనుంది. ఎక్స్‌ చందాదారులు సినిమాలు, టీవీ సీరియళ్లను పోస్ట్‌ చేయొచ్చని, వాటిని మానెటైజ్‌ చేయటం ద్వారా డబ్బు సంపాదించొచ్చని ఇలాన్‌ మస్క్‌ ఇటీవలే ప్రకటించారు మరి. తన సోదరికి జవాబు ఇస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి ఎక్స్‌ యూజర్లు ప్రతి స్పందనలూ తెలిపారు. పోస్ట్‌చేసిన సినిమాలకు ఒకసారి ఫీజు చెల్లించే విధానాన్ని వర్తింపజేయా లని ఒక యూజర్‌ సూచించారు. దీంతో ప్రజలు సబ్‌స్క్రయిబ్‌ చేసుకోకుండానే ఆ సినిమాలను కొనుక్కోవచ్చని, అప్పుడు ఎక్స్‌ నిజమైన సినిమా వేదిక కాగలదని ఆశించారు. ఎక్స్‌కు మెరుగైన వీడియో ప్లేయింగ్‌ యంత్రాంగం అవసరమని, అది సాకారం కావాలని కోరుకుంటున్నానని మరో యూజర్‌ ఆకాంక్షించారు. త్వరలో ఏఐ ఆడియెన్సెస్‌ అనే మరో ఫీచర్‌నూ పరిచయం చేయనున్నామనీ మస్క్‌ ప్రకటించారు. ప్రకటనలను సరైన యూజర్లకు చేరవేయటం దీని ఉద్దేశం. ‘మీ ప్రకటనలు ఎవరికి చేరాలని కోరుకుంటున్నారో దాన్ని సంక్షిప్తంగా వర్ణిస్తే చాలు. మా ఏఐ వ్యవస్థలు సెకండ్లలోనే అత్యంత సమంజసమైన ఎక్స్‌ యూజర్ల జాబితాను సిద్ధం చేస్తాయి’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని