UPSC: జొమాటో ఏజెంట్‌.. ట్రాఫిక్‌లోనూ యూపీఎస్సీ పాఠాలు

యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ జొమాటో ఏజెంట్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు సమయం వృథా కాకుండా ఫోన్‌లో పాఠాలు వింటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

Published : 30 Mar 2024 22:06 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగం.. ఎంతోమంది కల. అలాంటిది భారత అత్యున్నస్థాయి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్నతస్థానం సంపాదిస్తే.. ఆ కిక్కే వేరు. ఆ స్థాయికి వెళ్లాలని చాలామంది కలలు కంటుంటారు. శక్తివంచన లేకుండా కష్టపడతారు. ఇలాంటి ఉద్యోగాలు సాధించాలంటే ఓపిక చాలా అవసరం. కానీ, కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో మధ్యలోనే కొందరు వైదొలుగుతుంటే, ఒకటి, రెండుసార్లు ప్రయత్నించి తమవల్ల కాదనుకుంటూ  రేసు నుంచి బయటకు వచ్చేవారు కొందరు. ఇలాంటి వారందరిలో స్ఫూర్తి నింపేలా.. ఆయుష్‌ సంఘి అనే వ్యక్తి ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

గతంలో సీఏగా సేవలందించి, యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న ఆయుష్‌.. ఓ జొమాటో డెలివరీ ఏజెంట్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినప్పుడు కూడా సమయం వృథా కాకుండా మొబైల్‌లో యూపీఎస్సీ పాఠాలు శ్రద్ధగా వింటున్న వీడియోను పోస్టు చేశారు. కష్టపడి చదవాలనుకునే వారికి ఇది చూసిన తర్వాత ప్రత్యేకంగా స్ఫూర్తి నింపాల్సిన అవసరం లేదు కదా అంటూ రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని