Payal Rajput: మంచు విష్ణు సరసన పాయల్‌

మంచు విష్ణు కథానాయకుడిగా ‘గాలి నాగేశ్వరరావు’ తెరకెక్కనుంది. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తారు. అవ  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో విష్ణు సరసన పాయల్‌ రాజ్‌పూత్‌

Updated : 06 Mar 2022 12:50 IST

మంచు విష్ణు కథానాయకుడిగా ‘గాలి నాగేశ్వరరావు’ తెరకెక్కనుంది. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తారు. అవ  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో విష్ణు సరసన పాయల్‌ రాజ్‌పూత్‌ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్టు ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతోపాటు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నట్టు సినీ వర్గాలు  తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సంభాషణలు: భాను, నందు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని