Priyanka Chopra: డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా డీప్‌ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేశారు.

Updated : 06 Dec 2023 11:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డీప్ ఫేక్‌ వీడియోలను నివారించడానికి ఓవైపు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ..  మరోవైపు సినీ తారలు దీని బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాకు (Priyanka Chopra) సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

👉 Follow EENADU WhatsApp Channel

ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను కొందరు ఆకతాయిలు మార్చారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు లిప్‌సింక్‌ చేశారు. ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడించిన్నట్లు ఆ వీడియోను రూపొందించారు. ఒక బ్రాండ్‌ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్ని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  దీనిపై పలువురు స్పందిస్తూ.. ఇలా చేయడం దారుణమంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

సమస్యలో ఆమిర్‌ఖాన్‌, విష్ణు విశాల్‌.. సాయమందించిన అజిత్‌.. ఫొటో వైరల్‌

ఇక ఇటీవల రష్మిక డీప్‌ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలియా భట్‌, కాజోల్‌, కత్రినా కైఫ్‌ల డీప్ ఫేక్‌ వీడియోలు ఆందోళన కలిగించాయి. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని నివారించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ ఫేక్‌ వీడియోలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే సోషల్‌ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని