Ajith: సమస్యలో ఆమిర్‌ఖాన్‌, విష్ణు విశాల్‌.. సాయమందించిన అజిత్‌.. ఫొటో వైరల్‌

ఆమిర్‌ ఖాన్‌, విష్ణు విశాల్‌ల పరిస్థితిని తెలుసుకున్న అజిత్‌ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఏమైందంటే?

Published : 06 Dec 2023 02:05 IST

చెన్నై: ఇతరులకు సాయం చేసేందుకు ముందుండే కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ (Ajith) మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan), కోలీవుడ్‌ విష్ణు విశాల్‌ (Vishnu Vishal) సమస్యలో చిక్కుకున్నారని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించారు. ఆ ఇద్దరికీ అండగా నిలిచారు. అజిత్‌తో తామిద్దరూ కలిసి దిగిన ఫొటోను విష్ణు విశాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా మా పరిస్థితి తెలుసుకున్న అజిత్‌ సర్‌ మమ్మల్ని కలిశారు. మా విల్లా కమ్యూనిటీ సభ్యులందరికీ ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. లవ్‌ యూ సర్‌’’ అని విష్ణు విశాల్‌ పేర్కొన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సాయం కోరిన హీరో.. స్పందించిన రెస్క్యూ విభాగం

చెన్నైలో మిగ్‌జాం తుపాను ప్రభావం ఇంకా తగ్గలేదు. భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎలాంటి మార్పులేదు. ఈ క్రమంలో.. తాను నివాసం ఉండే కారప్పాకం ప్రాంతం పరిస్థితిని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ విష్ణు విశాల్‌ సాయం కోరారు. వెంటనే స్పందించిన ఫైర్‌, రెస్క్యూ విభాగాలు రంగంలోకి దిగాయి. విష్ణు విశాల్‌ ఫ్యామిలీ, ఆమిర్‌ ఖాన్‌, ఆ ప్రాంత ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. తన తల్లికి చికిత్స చేయించడం కోసం ఆమిర్‌ ఖాన్‌ కొన్నిరోజులుగా విష్ణు విశాల్‌ ఇంట్లో ఉంటున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు