ETV WIN: ‘ఈటీవీ విన్‌’లో ‘మిడిస్‌ క్లాస్‌ బయోపిక్‌’.. నవ్వులు పంచేలా టీజర్‌

శివాజి, వాసుకి ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘#90's ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’. తాజాగా విడుదలైన టీజర్‌ నవ్వులు పంచేలా ఉంది.

Updated : 30 Dec 2023 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేవలం రూ.1కే (రోజుకి) నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే తెలుగు ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV WIN). పలు వినోదాత్మక కార్యక్రమాలు, ధారావాహికలు, వెబ్‌సిరీస్‌లు, క్లాసిక్‌ మూవీస్‌తోపాటు కొత్త కొత్త సినిమాలనూ అందిస్తోంది. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్‌పై మరో సిరీస్‌.. ‘#90's ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ (#90’s - A Middle Class Biopic) సందడి చేయనుంది. ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేశ్‌ (Venkatesh) సోషల్‌ మీడియా వేదికగా టీజర్‌ విడుదల చేసి, వెబ్‌సిరీస్‌ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్‌ ఆద్యంతం నవ్వులు పంచేలా ఉంది.

‘తంగలాన్‌’.. భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరుస్తుంది: విక్రమ్‌

ఓ మధ్యతరగతి కుటుంబం ఇతివృత్తంగా ఈ సిరీస్‌ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆదిత్య హాసన్‌. 90ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. శివాజి, వాసుకి ఆనంద్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ 2024 జనవరి 5న విడుదల కానుంది. ‘ఛాంగురే బంగారురాజా’, ‘#కృష్ణారామా’, ‘నాగ భూషణం’, ‘దిల్‌ సే’ వంటి ఎన్నో కొత్త ప్రాజెక్టులు ఈ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని