Aamir Khan: ‘లాల్‌సింగ్‌ చడ్డా’ ఫ్లాప్‌.. ఆమిర్‌ఖాన్‌ ఎంతో బాధపడ్డారు..!

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) పరాజయం తర్వాత ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) ఎంతో బాధపడ్డారని బాలీవుడ్‌ నటుడు, క్యాస్టింగ్ డైరెక్టర్‌ ముకేశ్‌ తెలిపారు.

Published : 02 Dec 2023 20:43 IST

ముంబయి: ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) హీరోగా అద్వైత్ చంద‌న్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). ఎన్నో అంచనాల మధ్య గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా పరాజయం తర్వాత టీమ్‌ అందరి కోసం ఆమిర్‌ ఖాన్‌ ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడని క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ చబ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ను తీర్చిదిద్దడంలో టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని.. వారి వర్క్‌ను మెచ్చుకుంటూ ఆమిర్‌ పార్టీ ఇచ్చారని అన్నారు. దర్శక నిర్మాతలతోపాటు నటీనటులు, సహాయ సిబ్బంది అందరూ అందులో పాల్గొన్నారన్నారు. తప్పంతా తనదే అంటూ ఆరోజు ఆమిర్‌ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని ముకేశ్‌  తెలిపారు.

Social Look: ఓవర్‌ థింకింగ్‌ సీఈవో జాన్వి.. గాయాలతో కల్యాణి

ఆస్కార్ పుర‌స్కారం సొంతం చేసుకున్న ‘ఫారెస్ట్ గంప్‌’కి (Forrest Gump) రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమిర్‌ ఈ సినిమాలో నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది విడుదలైంది. కరీనాకపూర్‌, నాగచైతన్య, మాన‌వ్ విజ్, మోనాసింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక, ఈ సినిమాపై ఆమిర్‌ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దీని పరాజయం తర్వాత ఆయన ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు