Abhiram Daggubati: వైభవంగా దగ్గుబాటి అభిరామ్‌ వివాహం..

ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు తనయుడు అభిరామ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Updated : 07 Dec 2023 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు తనయుడు అభిరామ్‌ (Abhiram Daggubati) ఓ ఇంటివాడయ్యారు. కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువుల అమ్మాయి ప్రత్యూష చాపరాలను ఆయన పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికైంది. శ్రీలంక నుంచి తిరిగి వచ్చాక దగ్గుబాటి ఫ్యామిలీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీదేవి డ్రెస్‌లో మెరిసిన ఖుషి కపూర్‌.. మృణాల్‌ ఠాకూర్‌ స్పెషల్‌ పోస్ట్‌

‘అహింస’ (Ahimsa) సినిమాతో అభిరామ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది. కొన్ని రోజుల క్రితమే ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని