Social Look: శ్రీదేవి డ్రెస్‌లో మెరిసిన ఖుషి కపూర్‌.. మృణాల్‌ ఠాకూర్‌ స్పెషల్‌ పోస్ట్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Dec 2023 02:04 IST
  • జోయా అక్తర్‌ తెరకెక్కించిన ‘ది ఆర్చీస్‌’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌. డిసెంబర్‌ 7 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ది ఆర్చీస్‌’ ప్రీమియర్‌ నిర్వహించగా.. శ్రీదేవికి సంబంధించిన డ్రెస్‌లో ఖుషి హాజరయ్యారు. 2013 ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో శ్రీదేవి అదే డ్రెస్‌ వేసుకున్నారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
  • ‘హాయ్‌ నాన్న’ రిలీజ్‌ని ఉద్దేశించి మృణాల్‌ ఠాకూర్‌ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ప్రేమ, చిరునవ్వులు, క్యూట్‌నెస్‌తో ఈ సినిమా నిండి ఉంటుందన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకాలు అందించిన టీమ్ అందరికీ ఆమె థ్యాంక్యూ చెప్పారు.
  • ‘హాయ్‌నాన్న’ ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరుకు వెళ్లారు నటుడు నాని. ఇందులో భాగంగా శివరాజ్‌కుమార్‌ను కలిశారు. ఆయన్ని హత్తుకున్న ఓ ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘‘మా ఇంట్లో ఉన్న భావన కలిగింది. థ్యాంక్యూ శివన్న’’ అని పోస్ట్‌ పెట్టారు.

జాన్వీకపూర్

ఖుషి కపూర్‌

ప్రజ్ఞా జైస్వాల్‌

యుక్తి తరేజా

నాని - శివరాజ్‌కుమార్‌

మృణాల్‌ ఠాకూర్‌

రియా చక్రవర్తి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని