Navdeep: నా చిరునవ్వుకు కారణం వారే: రూమర్లపై నవదీప్‌

‘లవ్‌ మౌళి’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు నవదీప్‌. తనపై వచ్చే రూమర్ల గురించి ఆయన ఏమన్నారంటే?

Published : 03 Jun 2024 18:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ నవదీప్ (Navdeep) నటించిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఈ సినిమాతో ‘నవదీప్‌ 2.O’గా పరిచయం కాబోతున్నారాయన. ఈనెల 7న మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌తో నవదీప్‌ బిజీగా ఉన్నారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. తనపై వచ్చే రూమర్స్‌పై స్పందించారు. ‘మీ కెరీర్‌ ప్రారంభం నుంచి మీపై రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. మీ చిరునవ్వు మాత్రం చెరగలేదు. అంతగా మీకు సపోర్ట్‌ ఇచ్చేది ఎవరు?’ అని యాంకర్‌ అడగ్గా.. ప్రేక్షకులని నవదీప్‌ సమాధానమిచ్చారు. తనేంటో ఆడియన్స్‌కు తెలుసని పేర్కొన్నారు. ‘‘ఏదైనా క్లాస్‌ రూమ్‌లో గొడవ జరిగితే.. దానికి కారణం లాస్ట్‌ బెంచ్‌లో కూర్చొన్న వారే అని టీచర్‌/ప్రిన్సిపల్‌ అనుకుంటారు. కానీ, అక్కడి స్టూడెంట్స్‌ అనుకోరు. నా విషయంలోనూ అంతే’’ అని పేర్కొన్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఇంటిని గుడిగా మార్చిన అదా శర్మ..

అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ మౌళి’లో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లు. ‘‘ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? తదితర ప్రశ్నలకి సమాధానం మా సినిమాలో చూపిస్తున్నాం’’ అని టీమ్‌ తెలిపింది. ఈ చిత్రం ఈ నెల 7న (Love Mouli Release Date) విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని