Premgi: నటుడు ప్రేమ్‌జీ వివాహం.. సందడి చేసిన సెలబ్రిటీస్‌

నటుడు ప్రేమ్‌జీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై, సందడి చేశారు.

Updated : 09 Jun 2024 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు ప్రేమ్‌జీ అమరన్‌ (Premgi Amaren) ఓ ఇంటివాడయ్యారు. స్నేహితురాలైన ఇందును వివాహం చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ప్రేమ్‌జీ సోదరుడు, దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu), నటులు జై (Jai), వైభవ్‌ (Vaibhav Reddy) తదితరులు ప్రేమ్‌జీని ఆటపట్టిస్తూ సందడి చేశారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వెంకట్‌ ప్రభు పెట్టిన పోస్ట్‌పై స్పందిస్తూ.. పలువురు సినీ సెలబ్రిటీస్‌, అభిమానులు, నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్‌ (డైరెక్టర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌) కుమారుడే ప్రేమ్‌జీ. ఈయన పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూర్య ‘రాక్షసుడు’, శింబు ‘మానాడు’, నాగ చైతన్య ‘కస్టడీ’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రేమ్‌జీ మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌గానూ ప్రతిభ చాటుకున్నారు. వైభవ్‌ హీరోగా తెరకెక్కిన తెలుగు చిత్రం ‘కాస్కో’కు ఆయనే సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని