Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్‌దీప్‌ హుడా.. వధువు ఎవరంటే?

నటుడు రణ్‌దీప్‌ హుడా తన ప్రియురాలిని వివాహం చేసుకున్నారు. మణిపురి సంప్రదాయం ప్రకారం ఇంఫాల్‌లో వీరి పెళ్లి జరిగింది.

Published : 29 Nov 2023 21:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యారు. మోడల్‌, నటి లిన్‌ లైస్రామ్‌ (Lin Laishram)ను బుధవారం ఆయన వివాహం చేసుకున్నారు. ఇంఫాల్‌లోని ఓ దేవాలయంలో వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. మణిపురి సంప్రదాయంలో జరిగిన వీరి పెళ్లి ఫొటోలను ఇరువురూ తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. మణిపుర్‌కు చెందిన లిన్‌ లైస్రామ్‌, రణ్‌దీప్‌ ఎప్పటినుంచో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తమ వివాహం గురించి రణ్‌దీప్‌ ఇటీవలే తొలిసారి పెదవి విప్పారు. ‘‘మహాభారతంలో అర్జునుడు ఎక్కడ అయితే మణిపుర్‌ యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నారో అక్కడే కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో మేం ఒక్కటి కాబోతున్నాం’’ అంటూ కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్‌ చేసిన మానస్‌.. చెమటోడ్చిన దివి

2001లో విడుదలైన ‘మన్‌సూన్‌ వెడ్డింగ్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రణ్‌దీప్‌. ‘రిస్క్‌’, ‘కర్మ ఔర్‌ హోలీ’, ‘కాక్‌టైల్‌’, ‘జిస్మ్‌ 2’, ‘బాంబే టాకీస్‌’, ‘కిక్‌’, ‘భాగి 2’, ‘రాధే’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘ఓం శాంతి ఓం’, ‘మేరీ కోమ్‌’, ‘రంగూన్‌’, ‘జానేజాన్‌’ తదితర చిత్రాల్లో లిన్‌ నటించారు. రణ్‌దీప్‌ వయసు 47 ఏళ్లు కాగా.. ఆయన కంటే లిన్‌ పదేళ్లు చిన్నది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని