Sree vishnu: సిక్స్‌ కొడితే ఊరు దాటి వెళ్లింది.. ‘హనుమాన్‌’పై శ్రీ విష్ణు కామెంట్స్‌

‘హనుమాన్‌’ విజయం తనకు కూడా ఆనందాన్నిచ్చిందని హీరో శ్రీవిష్ణు అన్నారు.

Published : 21 Mar 2024 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ ‘హనుమాన్‌’పై హీరో శ్రీ విష్ణు (Sree vishnu) ప్రశంసలు కురిపించారు. తన తాజా చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆయన ‘హనుమాన్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ని హనుమంతుడిపై చేయడం నాకు బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్‌లో అద్భుతంగా చూపించారు. ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా ఇద్దరూ నాకు మంచి స్నేహితులే. అందుకే వాళ్ల సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. సిక్స్‌ కొడితే అది ఊరు దాటి వెళ్లింది’’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలోని మరికొందరు దర్శకుల గురించి మాట్లాడుతూ.. యానిమల్‌ తీసిన ‘సందీప్‌ వంగా ఆత్మవిశ్వాసం నాకెంతో ఇష్టం. తను చెప్పాలనుకున్న విషయాన్ని కచ్చితంగా చూపిస్తారు. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ హీరోని చూపించే విధానం బాగుంటుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా చూపిస్తారు. వివేక్‌ ఆత్రేయ రచనాశైలి బాగుంటుంది. నేను ఇప్పటివరకు పనిచేసిన దర్శకుల్లో ‘రాజ రాజ చోర’ దర్శకుడు హసిత్ గోలి పనితీరు నచ్చుతుంది. ఆయన వండర్స్‌ క్రియేట్‌ చేస్తారు’ అని చెప్పారు.

ఇక ‘సామజవరగమన’తో నవ్వులు పూయించిన శ్రీ విష్ణు ‘ఓం భీమ్‌ బుష్‌’తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 22న ఇది విడుదల కానుంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మూవీ తీర్చిదిద్దామని, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్‌ ఉంటుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు