Tillu Square: తెరపై హాట్‌గా కనిపించడం చాలా కష్టం: అనుపమ పరమేశ్వరన్‌

స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడం చాలా కష్టమని నటి అనుపమ పరమేశ్వరన్‌ అన్నారు. ‘టిల్లు స్క్వేర్‌’ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated : 26 Mar 2024 12:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో (Tillu Square) అలరించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 29న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి రాధిక పాత్రలో నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కనిపించనున్నారు. అయితే, ఈ చిత్రం ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచి ఆమెపై కొన్ని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. గతంలో చేసిన సినిమాల్లో కంటే అనుపమ ఇందులో గ్లామర్‌గా కనిపిస్తుందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా వాటిపై ఆమె స్పందించారు. చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్ట్యూమ్స్‌ గురించి మాట్లాడారు.

‘స్క్రీన్‌పై ఒక అమ్మాయి హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో నాకు ఈ సినిమాతో అర్థమైంది. చూసిన వాళ్లందరూ గ్లామర్‌గా ఉండే పాత్రలు చేస్తుందని సింపుల్‌గా కామెంట్స్‌ చేస్తారు. అలాంటి వాటిని చేయడం చాలా ఇబ్బంది. కొన్ని కాస్ట్యూమ్స్‌ స్క్రీన్‌పై చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ, అవి వేసుకుని సెట్‌లో అంతమంది ఎదుట ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాకు మాత్రమే తెలుస్తుంది. మరికొన్ని కాస్ట్యూమ్స్‌కు మొత్తం అద్దాలతో చేసిన వర్క్‌ ఉంటుంది. అవి గీసుకుపోతుంటాయి. ఇవన్నీ భరిస్తేనే గ్లామర్‌గా కనిపిస్తారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న నటీమణులందరినీ మెచ్చుకోవాలి. ‘టిల్లు స్క్వేర్‌’కు ఇష్టం లేకుండానే ఓకే చెప్పాను. షూటింగ్‌ ప్రారంభించాక సిద్ధూ ప్రతి విషయంలోనూ సలహాలు ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఆ తర్వాత అతడికి సినిమాపై ఉన్న ఆసక్తి అర్థం చేసుకున్నా. చాలా విషయాలు నేర్చుకున్నా’ అని అనుపమ చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో సిద్ధు మాట్లాడుతూ.. ‘‘అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరించేలా ‘టిల్లు స్క్వేర్‌’ ఉంటుంది. కచ్చితంగా మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని