Aparna Das: పెళ్లి పీటలెక్కనున్న యంగ్‌ హీరోయిన్‌.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..

హీరోయిన్ అపర్ణ దాస్‌ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. 

Updated : 23 Apr 2024 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బీస్ట్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరోయిన్‌ అపర్ణ దాస్‌ పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రియుడు దీపక్‌ పరంబోల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఏప్రిల్‌ 24న వీరి వివాహం జరగనుంది. తాజాగా హల్దీ వేడుకలు నిర్వహించారు. ఆ ఫొటోలు, వీడియోలను అపర్ణ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’తో దీపక్‌ పరంబోరల్‌ గుర్తింపు తెచ్చుకున్నారు.

అపర్ణ, దీపక్‌లు ‘మనోకరం’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించారని.. ఏప్రిల్‌ 24న పెళ్లి జరగనున్నట్లు దీపక్‌ ఇటీవల ఓ వీడియో పంచుకున్నారు. 2018లో ‘న్యాన్‌ ప్రకాశన్‌’ సినిమాతో అపర్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దాదా’ మూవీలో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు. గతేడాది వచ్చిన ‘బీస్ట్‌’తో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆదికేశవ’, ‘సీక్రెట్‌ హోమ్‌’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు