Actress Hema: బెంగళూరు రేవ్‌ పార్టీ.. ‘మా’ నుంచి హేమ సస్పెండ్‌?

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను (Hema) మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి సస్పెండ్‌ చేయాలని యోచిస్తున్నారు.

Updated : 05 Jun 2024 19:22 IST

Actress Hema(హైదరాబాద్‌): బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన సినీ నటి హేమను (Hema) మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి సస్పెండ్‌ చేయాలని యోచిస్తున్నారు. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెండ్‌ విషయమై చర్చ జరిగింది. అయితే, తుది నిర్ణయానికి ఇంకా రాలేదు. ఈ విషయమై అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగిన రేవ్‌ పార్టీలో కేసులో హేమ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఆమె విచారణకు హాజరు కావాలని పోలీసులు రెండు సార్లు నోటీసులు ఇవ్వగా.. విచారణకు హేమ హాజరుకాలేదు. ఇటీవల మరోసారి నోటీసులు ఇచ్చి.. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు హాజరు పరచగా.. జూన్‌ 14వరకు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. రేవ్‌ పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని